Monday, December 21, 2009

చరిత్ర నీడలో కలకత్తా !


గతుకుల దారుల ...
చితికినబతుకుల ...
ఉరుకుల పరుగుల దీ ..
                      నగరం


దోపిడి రాజ్యం
దొంగల బోజ్యం
కమ్మునిజం ..
            చూస్తారిక్కడ ఈ చోద్యం


నీ గతమేమో బానిస తత్త్వం
చేస్తావిప్పుడు పని దొంగతనం
రేపటి సూర్యుని చూడక పోతే ..
మార్పును ఆహ్వానించక పోతే ..
బతికేదేలాగ భావితరం ?


పేరుకైతే ఇది మహానగరం
చరిత్రకేమో మహాసముద్రం
బీటలు వారెను వర్ధమానం
చీకటి వీధులతో .. కూలిన గోడలతో ..


పేదా .. గొప్పా .. సమానమంటావ్ !
మన పాలననే సముచితమంటావ్ !
మన ఇద్దరి పయనం ఒకే దారిపై
నీవా మెరిసే కారులో ...
నేనీ తోపుడు బండీతో


మన పనులూ, పరువూ ఒకటేనోయ్
మన బాటా, మాటా ఒకటేనోయ్
మనమిద్దరం కష్టపడుతున్నాం
ఒకరి కోసం ఒకరం ..
నీ బూటుకు వన్నెతెస్తూ నేను ..
ఆ వన్నెలో నా ముఖం వెలిగిస్తూ నీవు ..


మన ఇద్దరి జీవితమొకటేలే
మన ఇద్దరి వీధీ ఒకటేలే
సహజీవనమే చేస్తున్నాం
నీవా మెరిసే కోటలో ....
నేనీ మురుగు నీటిలో !!

యువకులదంతా జులాయితనం
యువతులదంతా ప్రేమాయణం
ఏంచేస్తారులే వాళ్ళైన పాపం ..
చేయడానికి వారికి పనిలేదు
చూపడానికి నీ సిద్ధాంతం ఒప్పుకోదు !!

2 comments:

  1. Nice one ra Shanth.. Nice to see such a well-expressed feeling from u after such a long time.. I hope u will share some of ur old poems too here.

    ReplyDelete