Monday, December 6, 2010

Departure of raising scienctist from Telangana

M.Abhilash (04-02-1989:03-12-2010) S/O Agamaiah
Young Scientist who was just opposite to our house, died after 10 months of his painful strugle.
- A glittter from Telangana.

(From Hindu)
The 10-month-long battle for life came to an end, finally on Friday.
Aeronautical engineering student M. Abhilash, who suffered multiple fractures in a road accident on his birthday on February 4 at Petbasheerabad, died at the Nizam's Institute of Medical Sciences after developing pneumonia.
His classmate and close friend Ahmed Abdul Lateef, who was riding the bike, died on the day of the accident when an oncoming rammed into their bike. Both were bright students in their batch and making promising research in miniature aircraft designing.
Hailing from a poor family in Tandur of Ranga Reddy district, Abhilash had excellent academic record.
He dreamt of carrying out extensive research in aircraft designing.
Abhilash won laurels for his innovations in scientific designs at several exhibitions held across the country. He and Lateef studied the subject exhaustively and designed a miniature aircraft that runs on a battery and can be controlled with a remote gadget.
The accident confined him to hospital bed for months. Unable to bear the huge hospital expenses -Rs. 20,000 a day initially- Abhilash's father sold off everything he had.
With media reports highlighting the young scientist's plight, many came forward donating money for his treatment.
For few months, Abhilash was treated at Global Hospital at Bangalore and recently shifted to its Hyderabad branch. He was admitted to the NIMS after developing complications and died on Friday night.

Monday, November 29, 2010

జగన్ రాజీనామా .

29.11.2010: సోమవారం  కడప  MP Y.S జగన్  తన MP పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి YSR సతీమణి Y.S విజయలక్ష్మి కూడా తన పదవికి రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామాకు వివరణ ఇస్తూ ఐదు పేజీల బహిరంగ లేఖను రాశారు. అందులో గత 14 నెలలుగా పార్టీ తనను ఒంటరిని చేస్తూ వచ్చిందని, తన తండ్రి  మరణానికి కారణాల కోసం తూ తూ మంత్రంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు.

Thursday, November 25, 2010

ముఖ్యమంత్రి మార్పు సమంజసమేనా?

 రాష్ట్రంలో నెలకొన్నఅనిశ్చితి రోజురోజుకు పెరిగిపోయింది. రోశయ్య ముఖ్యమంత్రి బాద్యతలు తీసుకున్న రోజునుంచి రాష్ట్రం అతలాకుతలమయ్యింది . సామాన్యంగా ఇలాంటి పరిస్తితులను ప్రతిపక్షాలు ఒక అవకాశంగా తీసుకుంటాయి. అవకాశం దొరికిన ప్రతిసారి మీడియా ముందు విమర్శలు కురిపిస్తాయి .ఈ పరిస్తితుల్లో ఎవరికైనా సొంతపార్టీ నుంచి బలమైన సపోర్ట్ అవసరం. కానీ గత 14 నెలలూ రోశయ్యకు ప్రతిపక్షం కన్నా సొంత పార్టీ నుంచే ఎక్కువ ఇబ్బందులెదురయ్యాయన్నది వాస్తవం. సహజంగా మెతక స్వభావంగల రోశయ్య వీటిని ఎదిరించే సాహసం చేయలేదు . సమస్యలను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి మార్పు అవసరమే అన్నది విశ్లేషకుల అబిప్రాయం .

ఉత్కంటలో రాష్ట్రరాజకీయాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని రాజకీయాలు వేగంగా  మారిపోయాయి. మంగళవారం (23.11.2010) మాజీ  ముఖ్యమంత్రి  రోశయ్య  డిల్లీకి వెళ్ళడం, బుదవారం మద్యాహ్నం -24.11.2010 రాజీనామా సమర్పించడం , అదే రోజు సాయంత్రం  7గంటలకు అసెంబ్లీలో CLP సమావేశం, డిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  హై కమాండ్ ప్రణబ్ ముఖర్జీ , గులంనబి ఆజాద్, A.K అంటోనీ తదితరులు రోశయ్యకి  కృతఙ్ఞతలు, కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం సోనియాకె ఇస్తున్నట్లు రెండు ఏక వాక్య తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదింపచేయడం, మూడు గంటలు గడవక ముందే అంటే సుమారు రాత్రి 10 గంటలకే  ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆమోదించడం చకచకా  జరిగి పోయాయి.

Monday, November 22, 2010

పాప లేదని తెలిసి..నేస్తం కన్ను చెదిరి..

నవ మాసాలూ మీ అమ్మే మోసిందనుకున్నావు కదూ?
మీ అమ్మ నిన్ను మాత్రమే మోసింది తన గర్భంలో
కాని, నేను మిమ్మల్నిద్దర్నీ  మోశాను తల్లీ నా గుండెలో

చిట్టి తల్లీ నీకు తెలుసా?
దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని చిలికితే
అమృతం పుట్టిందట
నేను మీ అమ్మ ఎన్నో రాత్రులను మదిస్తే
నువ్వు పుట్టావురా..

మేధావులు వున్న వాటిని కనుక్కుంటారు
'జీవం' లేని వాటిని శ్రుస్టిస్తారు
నేను మేధావిని కాదురా.. కానీ
పాతికేళ్ళుగా సాగించిన ప్రస్తానంలో
నేను కొత్తగా కనుగొన్నదీ, సృష్టించిందీ నిన్నే..

నీ ఆరోగ్యం కోసం నేనో డాక్టర్నైనా
నీ ఆటకోసం నేనొక బొమ్మనైన
నీ పాలనలో నేనో సేవకున్నైన
మీ అమ్మ మనసులో నేనొక శిలనైన

నీ కోసం తిప్పిన పుస్తకాలూ
వెతికిన బ్లాగులూ, చూసిన సైట్లూ
వేసిన ప్రశ్నలూ, తెలుసుకున్న విషయాలూ
నా కోసం చదివితే నేనో మేధావినయ్యేవాణ్ని

వేయి లైన్ల కోడ్ లో దాగిన తప్పును
క్షణంలోనే పట్టగలిగిన
నేల రాలిన తారలో నశించిన శక్తిని
గాలిలోనే లెక్కగట్టిన
నీ కంటిలోని నీటినీ.. నీ ఒంటి లోని వేడినీ..
నీ కడుపులోని భాదనూ, నీ జీవితపు ఆయువునూ
పసిగట్టలేక పోయిన.
నా చదువూ, నా తెలివీ
నా జీతాన్ని నిలబెట్ట గలిగినయ్ కానీ నీ జీవితాన్ని కాదు..

తలుకుమన్నసిడిలో, టివి పైన ఫోటో ఫ్రేములో ..
గోడకేసిన ఊయలలో, గోడు బోయిన గుండెలో..
మోడు వారిన బతుకులో, ఆ అనంత ఆకాశంలో
మాకు పాఠాలు నేర్పి, గుణపాఠంగా  
ముసిముసిగా నవ్వుతూ... మా పాప!!

( నేస్తం కన్ను చెదిరినపుడు.. పాప లేదని తెలిసినపుడు )

సంధి కావ్యం

విరహాన్ని మెత్తగా
కోపాన్ని మత్తుగా
ప్రేమని ఘాటుగా
మనసును వేడిగా
మాటను వాడిగా
నీతిని తెలివిగా
బాధను హాయిగా
అనుభవించవోయ్ తలకిందులుగా
ఇక చొప్పుకోవోయ్  కొత్త కవితలా..

Sunday, November 21, 2010

మనుషుల గురించి!!

ఆలోచన రెండు రకాలు
ఒకటి ఇతరుల మేలు కోరేది
మరొకటి నిన్ను నీవు దహించేది
మిగితావంటావా ?
నేను మాట్లాడేది ఆలోచన గురించి !

వేగం రెండు రకాలు
ఒకటి మరణం వైపు నెట్టేది
మరొకటి విజయాన్ని తట్టేది
మిగితా వంటావా?
నేను మాట్లాడేది వేగం గురించి!

ప్రేమ రెండు రకాలు
ఒకటి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించేది   
మరొకటి నిన్ను ద్వేషించే వారినీ ప్రేమించేది  
మిగిలిన వంటావా?
నేను మాట్లాడేది ప్రేమ గురించి!


మనుషులు రెండు రకాలు
ఒకరు జీవితంకోసం పోరాడేవారు
మరొకరు పోరాటంకోసం జీవించేవారు
మిగితావాళ్ళంటావా ?
నేను మాట్లాడుతుంది మనుషుల గురించి!!

Wednesday, October 20, 2010

చీకటి నుంచి చిమ్మచీకటి వైపు

నోరు మాట్లాడుతూనే ఉంది
మౌనం వెంటాడుతున్నా
కన్నీరు కారుతూనే ఉంది
కనుపాపకు తెలవకున్నా
దుఃఖం పెల్లుబుకుతూనే ఉంది
ఆలోచన అదుపులో ఉన్నా
గుండె రోదిస్తూనే ఉంది
ధైర్యం  ఓదారుస్తున్నా
మనసు మూగబోయింది ..
దానికిపుడన్నీ శత్రువులయ్యా ఎందుకో?

కాలం మారే  కొద్దీ
దూరం పెరిగే కొద్దీ
మార్పులు జరుగుతాయంటారు
నిజమే, మార్పేదో జరుగుతుంది
కానీ అది ఎవరివైపు, ఎటువైపు ?

మనసిప్పుడు ..
ఉన్న వారిని వదులుకోమంటుంది  
లేని వాళ్ళు కావాలంటుంది
లేనివాళ్ళు ఉన్నపుడు  
ఈ ఆలోచన రాదెందుకో?


సమస్యకు ఎదురీదమంటారు
కానీ సమస్య వస్తే మనిషి సగం చస్తాడు
అపుడు నిలకడగా ఉండడమే కష్టంగాఉంటే
ఎదురీదడం ఎట్లా?

ఏటికెదురీదటం  మూర్ఖత్వం  
సమస్యకెదురీదడం సాహసం
తొలి దానికి దేహం కావాలి
మలి దానికి ధైర్యం కావాలి
మరి ధైర్యం చెప్పేవారే సమస్యైతే
నా గుండెను నింపే దెవరు? తీరం దాటే దెప్పుడు?

ధైర్యం స్థైర్యం కోల్పోయినపుడు
లోకం చీకటైపోయినపుడు
రేపన్నది కనిపించనపుడు
మనసు ఏం ఆశిస్తుంది?
మనిషి ఏం కావాలనుకుంటాడు?

ప్రతి చీకటికి ఒక వెలుగు
ప్రతి నిన్నటికి ఒక రేపు
ఉంటాయంటారు కదా,
అది నిజమేనా? ఐతే..
ప్రతీ చావుకూ ఒక పుట్టుక
ఉంటుంది కదా?
Date: 22.09.2010

Tuesday, September 21, 2010

జవాబు వేటలో ప్రశ్నల బాణాలు








(In memory of..)

ఆకాశం అంచులు దాటుతున్నాయ్
అగాధం లోతులను తాకుతున్నాయ్
నిన్నటి కాంతిని నల్ల మబ్బుల్లా ముంచుతున్నాయ్
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా .. ఆలోచనలు !

జరిగిందేదో జరిగిందిలే అని ఒకసారి
నాకే ఎందుకు జరిగిందని ఒకసారి
ఏది జరిగినా మన మంచికే అని ఒకసారి
జరగరానిది జరిగిందని ఒకసారి
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా .. ఆలోచనలు !

తప్పుల వేటలో ఒక అడుగు
కోపం అంచున ఒక అడుగు
రోదనతో ఒకటి, వేదనతో ఒకటి
ముందొక అడుగు వెనకొక అడుగు
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు !

తన భవిత ఒక సందేహం
నా బతుకొక సాహసం
పాపం ఎవరిది? శాపం ఎవరికి ?
కాళరాత్రులంటే ఇవేనేమో!
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు !

అన్యాయం చేసిందెవరు?
న్యాయం చూపేదెవరు?
ప్రేమల అగ్ని పరీక్షలో
సమిధగ మారిందెవరు?
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా .. ఆలోచనలు !

కర్మను భరిస్తూ ప్రేక్షకుణ్ణి కావాలా?
కర్తగ మారి త్యాగమేదన్న చేయాలా?
ఎవరి కర్మకెవరు బాద్యులు ఈ లోకంలో?
ప్రేమ భూతమై మింగుతూంటే?
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు !

ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయ్
జవాబులతో పని లేకుండా..
ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా?
జవాబిపుడు ప్రశ్నార్ధకం?
అంతు లేని ప్రశ్నల రాత్రులతో
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు!

అసలివి పుట్టిందెపుడు? చచ్చేదెపుడు?
మనిషి పుట్టినపుడు పుడతాయా?
మనసు నుంచి పుడుతాయా?
మనిషి చస్తే చస్తాయా?
మనసు చస్తే చస్తాయా?
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు!

Monday, September 20, 2010

కలకత్తా మెట్రో






(Culacutta metro since  24' October, 1984, - on the occassion of Hindi divas on 14092010 )
కాలంతో నా పోరాటం
గమ్యం చేర్చే ఆరాటం
నేటి తరానికి నా వేగం
ఎప్పటికైనా ఆదర్శం

కవి నజ్రూల్ ధంధం  నడుమన
దరి చేర్చే బాటసారిని
కలకత్తా మెట్రోన్నేను
కష్టాల కడలిని కాను

భూమిని సైతం చీల్చగలను
ఆకాశపు నిచ్చెనలెక్కగలను
ఎంతెదిగినా ఒదగగలను
తరాలనింకా మోయగలను

ఆవేశమన్నది నా నైజం
ఆలోచన కున్నది లే స్థానం
 ఆగుతు సాగుతు పయనిస్తూ
ఆత్మ విమర్శన చేయగలన్

ఉరుకుల పరుగుల వేగంతో
నువ్ నా ఒడిని చేరినపుడు
ఉక్కిరి బిక్కిరి సమయంలో
నీకు ఊపిరి ఆడనపుడు
ప్రతి మజిలిలో నీ కోసం
చల్లని గాలిని గుండెన నింపి
నీ ఒడికి మెల్లగా చేరుస్తా

ఆదివారపు సెలవులలో
హర్తాల్ బంద్ల గొడవలలో
మీరురాని సమయానికి
మీరులేని ఒంటరితనం
కడలి వదిలిన తీరం నేను
ప్రాణం వదిలిన నిర్జీవం నాది

వృద్డులనైతే ఆదరిస్తా
మగువలనైతే ఆరదిస్తా
బారమెంతైన భరించగలుగుతా
కాని, నా కింద పది నలగొద్దు దేహం
నీ జీవితాన్ని నాకు బలి చేయకు నేస్తం
నేటి తరానికి నా గమనం
కావాలింకా ఆదర్శం
కలకత్తా మెట్రోన్నేను
కష్టాల కడలిని కాను.

Thursday, September 16, 2010

అస్తిత్వం కోల్పోతూ ! వ్యక్తిత్వం వికసిస్తూ!!









ఎన్నో దూరాలను దాటి
తీరాన్ని చేరిందో పక్షి
ఇసుక తిమ్మెలను తెచ్చి
వాకిట్లో అందమైన కోటను కడదామని ..

నిలకడ లేని కోట ఎంత వాలినా
పట్టుదలతో నిలబెట్టాలనుకుంది

దాంట్లో తడి లేదు, పటుత్వం లేదు
నిలబడాలనే కసి లేదు
అయినా దాని ఓపిక చావలేదు
అది కడుతూనే ఉంది
కోట వాలుతూనే ఉంది
పక్షి మొండితనానికి లొంగిందో
దాని మూర్ఖత్వానికి నవ్విందో
చివరకు కోట నిటారుగా నిలవగలిగింది!

అంతలోనే జోరు వాన
కళ్ళముందే కట్టుకున్న కోటను
ఇసుకతో సహా తీసుకుపోయింది!

అయినా వానజోరు తగ్గలేదు
బహుశా పక్షి కన్నీటిని
కడగాలని కాబోలు..
దానికి తెలవదనుకుంటా ..
పక్షి  కన్నీరెప్పుడో
గుండెలోనే ఆవిరయ్యిందని
దానికి కనువిప్పే కాని
కన్నీరు తెలవదని!

ఇసుక తిరిగి తీరాన్ని చేరింది
అస్తిత్వం కోల్పోతూ !
పక్షి కొత్త ఆశలతో నింగికెగసింది
వ్యక్తిత్వం వికసిస్తూ
స్థాయిలెపుడో నిర్ణయించబడతాయ్
ప్రయత్నాలే చేయగలిగింది

ప్రయత్నించి ఓడిపో !
ప్రయత్నం చేయడంలో కాదు!!
ఇది తెలిస్తే ప్రశాంతం
మరి మరిస్తే మహాప్రళయం !!

15-09-2010/03:00 AM

Tuesday, September 14, 2010

మరు జన్మలో లగ్గానికి ....











మహావృక్షం ఎండిపోయింది
పిచ్చి కాకొకటి గూడు కడుతుంది
ఆశలను నోట్లో పెట్టుకుని ..
ఆశయాల గడ్డి పూసలతో ..

సందెపొద్దులో సూరీడు ఎర్రబడ్డాడు
ముసలిదొకత్తె సిద్ధమయ్యింది
ఆ సెగకు రొట్టెలు కాల్చడానికి
ఆకలి దుప్పటి కప్పుకుని ..
కన్నీటితొ పిండిని తడిపి...

జోరువానకు అడవి తడిసి ముద్దైపోయింది
పిచ్చివాడొకడు చెట్టుకిందకు చేరుతున్నాడు
ఎముకల గూడును కప్పడానికి
చిరిగిన తుండును చేతిలోకి తీసుకుని ..

కసాయొకడు కత్తి నూరుతున్నడు
దూడ ఆవు పొదుగును చేరాలనుకుంది
తల్లి పాలను తాగాలని ..
రేపటికింకా మిగుల్చుకుని ...

సంబరాలు జరిగిపోతున్నయ్
పిచ్చి ప్రేమికుడొకడు సిద్ధమౌతున్నడు
పట్టు బట్టలతో, పసుపు పారాణితో
మరు జన్మలో లగ్గానికి ....

మరో గోతిని పూడ్వడానికని!!

తన కొమ్మని తనే నరుకుతున్నాడో
                               తుంటరి ..
దారిన పోయే దానయ్యకు  జోస్యం చెప్పుకుంటూ...

గోతిని తొవ్వుతున్నాడు చూడు
                          గోచి ఎగబాకి  ..
ఎందుకంటే, అంటాడు మరో గోతిని
                           పూడ్వడానికని...

సముద్రంలో నీళ్ళు తోడుతున్నాడు
                               సన్నాసి ..
వాని ఊరి ఏటిని నింపడానికి ..

ఎండలో మంటకు గొడుగు పడుతున్నాడు
                                 మాడిపోతూ...
ఆ వేడి, సూర్యున్ని తాకకుండా ఉండడానికి ..

కొండను తొవ్వమందొకత్తె కోటగోడ నెక్కి ,
    పుట్ట లోని పాములను శాసిస్తూ ..
ఎదురు తిరిగిన ఎలుకను పట్టడానికి ..

కాసులు జల్లుతున్నారు గుంపు మీద
                           ఇసుక గంపతో ..
ఇసుక పోసినా రాలని జనం వచ్చినారని
                          తెలుసుకోడానికి..

పుణ్య పురుషుడని బయలుదేరినాడొక
                          వెర్రివాడు ..
అహంకారపు గునపం చేతబట్టి ఆవేశంతో...
తండ్రి పాపాలని  తెలవక తోడుకుంటూ..

Sunday, September 12, 2010

నాయకుడా? 'వి'నాయకుడా?

 *** ఇది నవ్వుకోవడానికని మాత్రమే, ఎవరిని కించపరచడానికి కాదు. గణేష్ చవితి శుభాకాంక్షలతో.... జై జై జై జై గణేశ! జై జై జై జై!!! ***
                                             ****

ఏమండీ! ఎప్పుడూ అలా టి వి చూస్తూ కూర్చుని వినాయకునిలా పొట్ట పెంచుకునే బదులు, కాస్త బయటకెళ్ళి తిరిగి రావచ్చుగా? కిచెన్ లోంచి సీత గొంతు. ఆడవాళ్ళకి పనిలేక మధ్యాహ్నం ఇరుగుపొరుగుతో మీటింగులు పెట్టుకుని ఆ హీరోల గురించి, పక్కవాళ్ళ భర్తల గురించి మాట్లాడుకుని, వాళ్ళ లాగా తమ భర్తలుండాలని, ఇంటికి రాగానే పోరు పెడతారు. అందులోనూ కాసేపయితే 'అగ్నిలో అరుంధతి' 742 వ ఎపిసోడు ప్రారంభమవుతుంది. నాకసలే టి వి సీరియల్స్ అంటే మంట. ఎప్పుడో మా బామ్మ నడి వయసులో ఉన్నపుడు ప్రారంభమయిన 'వంటింటి రామాయణం' మొన్న బామ్మ 25 వ వర్దంతి దాక అయిపోలేదు.
యాడ్స్ రాకా, సీరియల్స్  లో ఆర్టిస్ట్ లకు జీతాలు ఇయ్యని పరిస్థితి వచ్చి మొన్నే సీరియల్ని ఆపేశారు. అయినా! వినాయకుడు నాలా కాకుండా మాంచి సిక్స్ ప్యాక్ లో ఉంటే నాకీ బాదుండేది కాదు. అందుకే నాలా ఉన్నందుకు ఆయన్ని తిట్టుకుంటూ మెట్లు దిగి హుస్సేన్సాగర్ వైపు నడిచాను.

 అసలు ఈ సిక్స్ ప్యాక్ ని ఎవడు కనిపెట్టాడో కాని కనిపిస్తే ఎన్కౌంటర్ చేయాలి. మొదట్లో సీత వూరికే సిక్స్ పాక్స్ అంటే అదేదో ఫ్యామిలి ప్యాక్, జంబో ప్యాక్ లాంటిదనుకుని ఆ మద్య ఓ ఐదు మంది స్నేహితులతో 'బావర్చి' కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆర్డర్ చేశా! వెయిటర్ నన్ను పిచ్చివాణ్ని చూసి 'మెను' మొహానికి విసిరి వెళ్ళిపోయాడు. అందులో ఆ ఐటం లేదు. నాకేమి అర్థం కాలేదు!
అసలు సిక్స్ ప్యాక్ అంటే ఏమిటని ఆరా తీస్తే అది మా ఊళ్ళో అన్నం, గంజి లేక నీళ్ళు  తాగి చావడానికి దగ్గర పడే ముసలి పీనుగలకి మళ్లే పొట్ట కనిపించడమని  తెలిసింది.  దీనికెందుకింతగా  బాధపడ్తుందో సీత అని, కొన్ని రోజులు అన్నం తినడం మానేసి గంజి మాత్రం తాగడం ప్రారంబించాను. సరిగ్గా మూడంటే మూడే రోజులు, ఒకటే నీరసం, జ్వరం, అలసట. ఆసుపత్రిలో చేరిస్తే  10  సెలైను బాటిల్స్ ఎక్కించి వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రాణం పోయి తిరిగి వచ్చినంత పనయింది కాని పొట్ట మాత్రం తగ్గలేదు. ఈ సారి సులువు గా ఉంటుందని ఓ మెడికల్ షాపు కెళ్ళి, కుర్రాన్ని పిలిచి పొట్ట తగ్గి సిక్స్ పాక్స్ రావడానికి ఓ పది టాబ్లెట్స్ ఇవ్వవోయ్! అన్నాను. అంతలోపే వాడు నేలపై పడి గిలగిలా కొట్టుకోవడం ప్రారంబించాడు. నాకేమీ అర్థం కాలేదు, అందరూ నన్ను చూసి నవ్వుతుంటే అవమానంగా  కూడా తోచింది. నా బాధ ఆ కుర్రవాడికి అర్థమయిందో ఏమో, వాడు ఎదురుగా ఉన్న 'జిమ్' ని చూపించి అక్కడికెళ్ళి రోజూ ప్రయత్నించండి అని సలహా ఇచ్చాడు.
ఈ సారి 'జిమ్' కు వెళ్లి ఓ పది రోజుల్లో సిక్స్ పాక్స్ తెచ్చుకోవాలని పథకం వేశా! ఒక ఆదివారం 'జిమ్' కోసం ప్రత్యేకమైన డ్రెస్సు, షూస్ కొనుక్కుని 'జిమ్' లో జాయిన్ అయ్ పోయా. పొద్దున్న 8 గంటలకే జిమ్ లో అడుగుపెడితే అప్పటికింకా ఎవరూ రానట్లున్నారు. ఇది కూడా మా ఆఫీసు లాగా 10 గంటలకి ప్రారంబమవుతుంది కాబోలనుకుని, అక్కడ ఇనుప గుండ్లూ, రాడ్లూ, కర్రలూ గట్రా చిందర వందరగా పడిఉంటే అన్నీ తీసి అటకపై సర్ది జిమ్ ప్రారంబిద్దామని ఒకటొకటిగా తీసి అటకమీద పెడదామనుకున్నా. అవి కాస్త బరువుగా ఉండి, అటక కొంచెం ఎత్తులో ఉండే సరికి నడుం పట్టుకుని ఒకే విరోచనాలు..
ఈ సారి ఆసుపత్రిలో 10 సెలైను బాటిళ్ళు, కాని వారానికి కాదు, ఒక్క రోజుకి. నరాలకు సూది గుచ్చి సెలైన్లు ఎక్కిస్తుంటే చేతులకున్న నరాలన్నీ వాచి, పొట్ట తగ్గడం దేవుడెరుగు, చేతులు మాత్రం వస్తాడు కు మళ్లే మారినాయ్. ఇవన్నీ  కాదు ఈ సారి మాస్టర్ ప్లాన్ వేయాలని ఆలోచిస్తుంటే, పక్క ఫ్లాట్ లో ఉండే రిటైర్డ్ ఇన్కం టాక్స్ ఆఫీసర్ సుబ్బారావ్ , రోజూ అర గంట నడిస్తే సన్నబడతారని  సీతతో చెప్పాడట, అప్పటినుంచీ నేను ఇంటికి రాగానే బయటకి పంపడం సీతకలవాటై పోయింది. నేనేమన్నా అంటే వినయకుడిలా కొండంత పొట్ట నీకు, అని గుర్తు చేస్తుంది.
రేపు వినాయక చవితి కదా! ఒక వేల ఆ వినాయకుడే గనక కనపడితే ఆ పొట్ట తగ్గించుకోమని చెప్పాలి, లేకుంటే ప్రతి ఒక్కరు తనతో నన్ను పోల్చి ప్రాణం తింటున్నారు, అనుకుంటూ ట్యాంకుబండ్ పైకి అడుగు పెట్టాను. అటు ఇటూ జనం కోలాహలం, విద్యుద్దీపాల వెలుగులో బుద్దుడు.. చల్లని గాలి, అటు వైపుగా ప్రముఖుల  విగ్రహాలూ.. ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ? వీటి మద్య నడుస్తుంటే అసలు సమయమే తెలవదు. అలా నాలుగు సార్లు పచార్లు కొట్టి తిరిగి ఇంటికి వెలదామనుకునే లోపు అటుగా ఓ బెంచీ పైన ఒక వినాయకుడి విగ్రహం పెట్టి ఉండడం కనపడింది. ఇదేమిటీ ఈ రోజు ఇక్కడ వినాయకుడి విగ్రహం అని దగ్గరికి వెళ్తే అది విగ్రహం కాదు, సాక్షాత్తూ ఆ వినాయకుడే. చాలా బాధగా ఉన్నాడు. సీత అనుకున్నట్లు పొట్టేమీ లేదు. సన్నగా ఎముకల గూడుకు తోలు కప్పినట్లున్నాడు. ఈయన కూడా సిక్స్ పాక్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబోలు! అనుకున్నాన్నేను. అయినా రేపు వినాయక చవితి. ఎక్కడో ప్రముఖ చౌరాస్తా లో ఉండవలసిన ఈయన ఇక్కడున్నాడేమిటి?
 అదే అడిగాను, ఏం సామీ! రేపు నీ పండగ కదా, నువ్వు జనం మద్య హడావిడిలో కోలాహలంగా సి టి లో ఉండాలి కదా, ఇక్కడున్నావేం? అని.
 ఏం చెప్పమంటావ్ నాయనా! ఎన్నో ఏళ్ళ నుంచి నన్ను ఆది దేవుడనీ, నన్ను పూజించనిదే ఏ దేవుడునీ పూజించరాదనీ మీ ప్రజలు ఎంతో గొప్పగా స్టేజీలు వేసి సంబరాలు జరుపుకునే వారు, కాని పోయిన సంవత్సరం నుండి పరిస్తితులు మారి పోయినయ్, మాకు ఆదరణ తగ్గి పోయింది.
 అదేం సామీ! యుగాల నుంచి ఇప్పటి దాకా మీరే మా ప్రథమ ఆరాద్యం, కాదని ఎవరంటారు, అయినా ఏమూడు రోజులో అయిదు రోజులో 11 రోజుల తర్వాతో ఇక్కడకు రావాల్సిన మీరు ఇప్పుడే వచ్చి కూర్చున్నారేం?
  చెప్పాను కాదా నాయనా! పరిస్తితులు మారిపోయినాయ్, ఆ మద్య మీ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి ఉండేవాడట! ప్రజల కోసం ఏమేమో మంచిపనులు చేసిండంటా, మీటింగుల్లో ఎదుటివారు సవాలు విసురుతూ తొడ కొడితే ఈయన గాల్లో ముద్దులు పెట్టుకునే వారట.
అదా సామీ! ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి ప్రజలు ఆయన్ని వై యస్ ఆర్ అని పిలిచేవారు. కొందరు నాయకుడన్నారు మరికొందరు అపర బగీరతుడన్నారు ఇంకొందరైతే ఏకంగా దేవుడే అన్నారు.
అదే నాయనా! అక్కడే వచ్చి పడింది చిక్కు. ఆయనని మీరు దేవుడని పొగిడే వరకు అది నిజమను కుని ఇప్పుడు మా దేవుల్లకే ఎసరు పెట్టాడు. 
ఒక సామాన్య మానవుడు అందులో చనిపోయిన వ్యక్తీ మీకు ఎసరు పెట్టడమేమిటి సామీ?
ప్రతీ సంవత్సరం ప్రముఖ కూడళ్ళలో, రహదారుల్లో రద్దీగా ఉండే రోడ్డుల పక్కన, కాలనీల్లో, పార్కుల్లో మా విగ్రహాలు పెట్టేవారు గుర్తుందా?
గుర్తు లేకేం సామీ, మీరు మా ఆరాద్యులు.
ఏం ఆరాద్యులం లే కాని, ఇప్పుడు ఆ ప్రదేశాలన్నీ ఈయన విగ్రహాలతో నిండి పోయినాయ్, మీమంటే సంవత్సరానికి ఏ అయిదు పది రోజలు మాత్రమే ఖబ్జా చేసుకునే వాళ్ళం, కాని ఈయన మాత్రం మా స్తలాలను పర్మనెంటుగా ఖబ్జా చేసేసుకున్నాడు. అయినా దేవుళ్ళ ఆస్తులకు ఈ రోజుల్లో రక్షణ ఎక్కడుంది మీ లోకంలో?
సామీ! ఆయనకు రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా ప్రపంచమంతా అభిమానులున్నారంటా. ఎంతో మంది జనం ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయారంట, కొందరైతే ఏకంగా ఆత్మహత్యలే చేసుకున్నారట తెలుసా? అందుకే ఆయనకు గుర్తుగా, ఓదార్పులు చేస్తూ విగ్రహాలను ప్రతిస్తిస్తున్నారు. అయినా మీరు దేవుళ్ళు, మీ నాయన సృస్టికి ఆదిపురుషుడు, అంటే  మీ నాయన పుట్టే నాటికి భూమ్మీద ఎవరూ పుట్టి ఉండరు. అట్లాంటప్పుడు మీ నాయన కూడా కొంత ఆస్తులు వెనకేసుంటే మీకీ కస్టాలు ఉండేవా చెప్పు? ఎవరో వాడుకోవలసిన స్థలాల్లో మీరు సర్దుకునే అవసరం ఉండేది కాదు గదా?
మాకు ఎప్పుడూ భక్తులూ, పేదలూ వారి కష్టాలే కాని మా గురించి ఆలోచించే సమయం ఎక్కడిది చెప్పు, ఇంకా మా నాయనా అంటావా? ఆయనకు కాషాయ వస్త్రం, భూడిద తప్ప ఈ ఆస్తులపై ఆశ లేదు, అవసరం రాలేదు. అయినా ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటాం చెప్పు? అవసరానికి ఆదుకోనూ లేవు, ఆశలనూ తీర్చనూ లేవు. ఆస్తులు ఉంటే ఏం లాభం? లేకుంటే ఏం నష్టం?
అయ్యో! అదేం సామీ అలా అంటారు, మీకు ఆస్తులుంటేనే కదా? దాంట్లోంచి కొంత ప్రభుత్వానికి రాసేసి త్యాగాశీలుడనే బిరుదు కొట్టేయొచ్చు. ఇక ఆస్తులే లేకపోతె దానం చేసేదెప్పుడు? పేరు వచ్చేదెప్పుడు? అందుకే ఒక వెయ్యెకరాలు ఖబ్జా పెట్టి పది ఎకరాలు దానం చేస్తే ఇటు ఆస్తులూ మిగులుతాయి అటు పేరు ప్రతిష్టలూ వస్తాయి. మీరు మరీ అమాయుకులు మళ్లే ఉన్నారే?
 అదే, ఖబ్జా పెట్టుకుని ఏం చేయమంటావ్, ప్రజలకయితే దేనికైనా ఉపయోగ పడ్తుంది కాదా? మీరు సంతోషంగా ఉండడమే కదా మాకైనా ఈ నాయకులకయినా కావాల్సింది?
మీకు బొత్తిగా లోక జ్ఞానం కరువైంది సామీ. పాత తరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనకంటూ ఓ పేరూ పలుకుబడీ పది మంది జనం ఉండాలంటే ఆస్తులు తప్పకుండా ఉండాలి. అంతెందుకు మీ దేవుళ్ళు కూడా ఆస్తులు పోగు పెట్టినందుకే కదా, ఈ రోజు అంత దర్జాగా బతకగలుగుతున్నారు. ఎంతోమంది నాయకుల్ని బతికిస్తున్నారు.
ఏమిటీ! మా దేవుళ్ళు ఆస్తులు ఖబ్జా చేసుకున్నారా?
లేకేం సామీ? ఆ మూడు నామలాయన ఏకంగా ఏడుకొండలనే ఖబ్జా చేసుకోలేదా? ఇక డబ్బుకూ, నగలకూ కోరవే లేదు. అందుకే ఆయన వెంటే జనం, ఆయన చెంతే జనం. ఆ ఆస్తులని కొంచెంకొంచెం కాజేస్తూ ఎంతోమంది తరాలుగా సుఖపడడంలేదా?
ఆయన ఆస్తులు ఖబ్జా చేయడమేమిటి? మీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక, ఎక్కడైనా దాక్కుందామని, ఈ గుబురు అడవులూ, ఏడు కొండలూ దాటుకుని ఇక్కడికొచ్చాడు. ఆయినా జనం వదలలేదు. భక్తులు ఆయన్ని తిరిగిరమ్మని ఎన్నో ముడుపులూ, కానుకలు ఎర వేసినా ససేమిరా అన్నాడు ఆ సామీ. మీ మోసాలనూ కుళ్ళునూ భరించే శక్తి నా దగ్గర లేదు మహాప్రభో నన్ను వదిలేయండని అక్కడే సెటిలయిపోయాడు .
సరే ఆ విషయం పక్కన పెట్టండి సామీ! మీకు ఆ దేవుడికి మళ్లే లేకున్నా కనీసం మానాయకులకు మళ్లే ఆస్తులున్నా ఈ రోజు మీకీ దుస్తితి వచ్చేది కాదు గదా? అవును సామీ, ఆస్తులు లేకుంటే లేదు, కనీసం మీ దగ్గర బంగారు ఆభరణాలూ, వజ్ర వైడూర్యాలూ అయినా ఉన్నాయా?
బంగారం, వజ్రాలూ నాకెప్పుడు బహుమతి ఇచ్చారు మీరు? మట్టితో చేసి దానికి బంగారు రంగులే కదా అద్దేది? దానికే భక్తులిచ్చే అమూల్య కానుకని సంబరపడిపోయి దేవలోకంలో నేనే దనవంతున్ని అని ఫీల్ అయ్యేవాణ్ని. ఏ మాట కామాటే చెప్పు కోవాలి మీరు వేసే ఆ రంగులు, ఆభరణాల కన్నా అందంగా ఉంటయ్ తెలుసా?
ఫీల్ అయ్యే వాణ్ని అంటున్నారు, ఇప్పుడు ఆ ఆనందం లేదా? సామీ.
ఎక్కడి ఆనడం నాయనా! వేసే రంగుల్లో రసాయనాలున్నయట , అందుకే ఇక వాటిని వేయకూడదని మీ ప్రబుత్వం తీర్మానిన్చిందట! అందుకే ఆ రంగులు కూడా కరువయి నిరుపేదలా మారిపోయాను. నా పేదరికాన్ని చూసి మిగితా వాళ్ళు నవ్వుకుంటున్నారు.
 చూసారా సామీ! పేదలంటే ఎంత చులకనో ఈ లోకంలో, అందుకే మనకంటూ పదెకరాల ఫాంహౌసో, బంజారా హిల్స్ లో ఓ పెద్ద కొంప, ఓ పది  ఇరవై కోట్ల ఆస్తి, దానితో పాటు మోయలేనంత పసిడి ఉండాలి, దానితో పాటు అమాయకులను మోసం చేసే గుణం కూడా ఉండాలి. ఆ మాత్రం లేకుంటే ఇక్కడ బతకలేం, బతికినా వేస్టే. అది సరే సామీ! కొండంత పొట్ట ఉండే మీరు ఇలా మారిపోయారు, డైటింగ్ చేస్తున్నారా? లేక మీ దగ్గర కూడా సినీ పరిశ్రమేమైన ఉందా? అసలు సీత మిమ్మల్ని ఇలా చూస్తె ఈ జన్మలో నన్ను మీతో పోల్చి తిట్టదు కదా? ఇన్ని రోజులూ మీ గురించి అలా అన్నందుకు సిగ్గుతో చచ్చిపోతుంది తెలుసా? మీకు కూడా మా హీరోలకు మళ్లే కాంపిటిషన్ ఎక్కువగా ఉంటుందా సామీ, స్వర్గం లో?
కాంపిటీశనా పాడా? తినడానికి తిండి లేదు, ఆకలికి మాడి పోతుంటే, ఎవరో భక్తురాలు ఒకసారి పాలు తెచ్చింది, ఆకలికి తాలక పాలు తాగితే మీ మీడియా వాళ్ళు రీసర్చ్ చేసి నీళ్ళు తాగుతాడేమోనని పరీక్షలు పెట్టారు. అలా తిండి, పాలూ మాని 11 రోజులూ ఒట్టి మంచి నీళ్ళుతాగి గడిపేసరికి ఇలా తయారయ్యాను.
 అదేం సామీ! అంత ఆకలిగా ఉంటే చేతుల్లో ఉండే లడ్డు లాగించేయొచ్చు  కదా? అందులో అది మీకు ఇష్టమైన నైవేద్యమాయే!
 నాకిష్టమయినదే, కానీ ఎలా తినమంతావ్? ఆకలికి ఒకసారి ఇట్లానే తింటే, జనం నాపైన నిందలేశారు. దేవుడి దగ్గరే దొంగలు పడి దోచుకుంటే ఇంకా మమ్మల్ని ఈయనేం కాపాడుతాడని. అప్పటినుంచీ ఆకలికి ప్రేగులు పీక్కుపోతున్నా, నోరు కట్టేసుకుంటాం  కాని మీ లడ్డూని మాత్రం ముట్టుకోం. దాన్ని ఆ 11 రోజులూ మోయలేకా కాపాడలేకా నరకం అనుభవించాల్సిందే! చూడు  ఎడమ చేతి ఎంతగా వాచి పోయిందో?
 నిజమే, అచ్చం నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సెలైను ఎక్కిస్తే వాచినట్లే ఉంది. అది సరే సామీ! మీకంతగా అన్యాయం జరుగుతుంటే ఇలా ఊరికే బాద పడేకన్నా మీ మిగతా సోదరులు గల్లీకి 10  చొప్పున ఉంటారు కాదా? అందరూ కలిసి ధర్నాలు చేయొచ్చు కదా?
  నా మాట పూర్తి  కాక ముందే నవ్వడం ప్రారంబించి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ కాలంలో ఉన్నావు నాయనా నువ్వు? గల్లీకి 10 మాట దేవుడెరుగు పది గల్లీలకు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు.
 ఇదేం విడ్డూరం సామీ? వీధి వీధికీ ఈ పది రోజులూ మీరే  కనపడతారు మాకు ఇప్పుడేమయిందని మీ జనాభా తగ్గింది?
 చెప్పాను కదా, మీ దేవుడనీ ప్రజలంతా ఆయన విగ్రహాల కోసం చందాలు ఇచ్చారంటా, ఇక మాకోసం ఇవ్వడానికి చిల్లి గవ్వా లేదని ఖరాఖండిగా చెప్పారట, ఇప్పుడు గణేష్ సంఘాలు కనుమరుగై కొత్త సంఘాలు వచ్చేసినాయ్. మా కోసం ఐతే సంవత్సరానికి ఒక్క సారే చందా వసూలు చేయొచ్చు. కాని నాయకుల కోసమైతే ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చు. అందుకే జనం అటు మొగ్గు చూపుతున్నారు. దాంతో మా బలం తగ్గిపోయింది.
 అప్పటికే ట్యాంకు బందు మీద రద్దీ కొంచెం తగ్గింది, దీపాల కాంతి కూడా తగ్గుతుంది.
 వెళ్ళు నాయనా, ఇంట్లో సీత నీకోసం ఎదురుచూస్తుంది. నా కస్టాలు చెప్పుకుంటూ పోతే ఎప్పటికి అంతం ఉండదు.
 అవును, మాటల్లో పడి టైం మర్చి పోయాను. సరే ఉంటా సామీ, వీలయితే నిమజ్జనం రోజు కలుస్తా. ఆ రోజు ఎలాగో మాకు హాలిడే.
 ఇంటి వైపుకు నడక ప్రారంబించాను. ట్యాంకు బండ్ నుంచి దోమల్ గూడా చేరడానికి పెద్ద సమయమేమి పట్టలేదు. నాకెందుకో మనసులో బాధగా అనిపించింది. నిజమే కదా? పాపం మనకి కష్టాలు వస్తే   దేవుడికి చెప్పుకుంటాం, అలాంటిది దేవుడికే కష్టాలొస్తే? జనం కూడా నిజంగానే దేవుళ్ళని మరిచి నాయకులకు పూజలు చేస్తున్నారు. ఆ మద్య సర్వ్ లో తేలిందేమంటే, రాష్ట్రం లో దేవుళ్ళ కోసం ఉపయోగించే పూల కన్నా నాయకులకోసం ఉపయోగించేది 5 రెట్లు  ఎక్కువట. ఈ మద్య ఎక్కడ చూసినా  రాజకీయ నాయకుల విగ్రహాలే. అసలు ఎంత మంది నిజంగా ముఖ్యమైన ప్రదేశాల్లో విగ్రహాలుండాలనుకుంటున్నారు. బతికినన్నాళ్ళూ పేదల భూములు కాజేస్తున్నారు, చచ్చినాక రోడ్లన్నీ ఖబ్జా చేసేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రాంతాలకి వీరి పేర్లు పెడ్తున్నారు. చారిత్రిక ప్రాంతాలకు అట్లా పేరు మార్చడం ఎంత వరకు కరెక్ట్. ఇప్పటి దాకా జనం దేవుళ్ళ పేర్లు  పెట్టుకున్నారు, ముందు ముందు ఈ లీడర్లు.. దేవుళ్ళకి నాయకుల పేర్లు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఈ మద్య టి వి చానల్ లో వినాయకుణ్ణి ఓ టెర్రరిస్టులా , ప్రకృతిని పాడుచేస్తున్న అణు బాంబులా చూపిస్తున్నారు. సాగర్లో వేస్తే కెమికల్స్ తో ఈ రాష్ట్రం మొత్తం కలుషితమవుతుందట.  ఎంత బాదపడుతుందో కదా ఆ సామి మనసు !! అట్లా అంటే మనవల్ల ప్రకృతికి ఎంత నష్టం, ప్రకృతికి హాని అని మన కాలకృత్యాలు మానేశామా? రోజూ మనం వాడే వాహనాలూ గట్రా వల్ల వచ్చే నష్టం కన్నా ఏడాదికి ఒక సారి జరిగే నష్టం ఎక్కువేం కాదు. సరే అలా పాడుచేస్తే దానికోసం ప్రత్యామ్నాయం ఆలోచించాలి కానీ ఇలా గంటల కొద్దీ చానల్స్ లో ప్రోగ్రామ్స్ ఏమిటి? తినడానికి ఆహారం లేక, ఉండడానికి స్థలం లేక, చివరికి మొహానికి రంగు కూడా వేసుకోకుండా ఉండాలని దేవుడిని శాసిస్తున్నాడు మానవుడు.ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్దర పోయానో కాని తెల్ల వారి ఇంటి ముందు జరుగుతున్న హడావిడిని చూసి మెలుకువ వచ్చింది. ఇంటి ఓనర్ మా ఫ్లోర్ లో కనపడ్డాడు. అందరూ భయం భయం గా కనపడుతున్నారు. ఏమైందో నని కారిడార్ లోకి వెళ్లి చూస్తె లోయెర్ ట్యాంక్ బండ్ నీటిలో మునిగి పోయి ఉండి, మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా జలమయ మైంది. టి వి ఆన్ చేసి చూస్తే, బ్రేకింగ్ న్యూస్ లో 'వినాయకుని ఆత్మహత్య' అని కనపడింది. ఆ ఫోటో చూస్తే రాత్రి నేను మాట్లాడిన వినయకుడిదే. పాపం అవమానం తట్టుకోలేక ఎంత పని చేసాడు.
 ఈ వార్త తెలిసి నాయకులు ఒక్కరొక్కరే వచ్చి టి వి వాళ్ళకి కవరింగ్ న్యూస్ ఇస్తున్నారు. రోశయ్య 'నాకేమీ తెలవదు, అంతా హైకమాండ్ చూసుకుంటుంది , నన్ను అడుగుతారేం నేనే తోసినట్లు ' అని మీడియా పై రుసరుస లాడారు.
 చంద్రబాబు 'దీనికి కారణం రోశయ్య ప్రబుత్వమే, కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు'
 కే సి ఆర్ ' ఇది తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం, వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే' అని డిమాండ్ చేసారు.
 లగడ పాటి ' తెలంగాణ వినాయకులు మంచి వాళ్ళే, తప్పంతా తెరాస నాయకులదీ, పార్టీది! ప్రత్యేక రాష్ట్రం ఇస్తే రాష్ట్రం లోనే కాదు దేశం లోని అందరు వినాకులు చనిపోతారని  జ్యోస్యం చెప్పారు.
 కాంగ్రెస్స్ అధిష్టానం ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని ప్రకటించింది.
 చిరంజీవి ' హుస్సేన్ సాగర్ నీళ్ళని పోలవరంలో కలిపేస్తే, ఇక్కడ నీళ్ళే ఉండవు కాబట్టి ఎవరు చనిపోయే అవకాశం లేదని' తిరుపతి నుంచి పోలవరానికి పాదయాత్ర మొదలు పెట్టాడు.
 ఇక జగన్ మాత్రం ఇది పోయిన సంవత్సరం మా నాన్న చనిపోయినందుకు తట్టుకోలేక ఇప్పుడు ఈ వినాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించాడు. ఓదార్పు యాత్రగా హుస్సేన్ సాగర్ కి బయలు దేరి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలకు తలా లక్షరూపాయల పరిహారం ప్రకటించి, టక్కున నాలుక కరుచుకుని లక్ష విలువ చేసే బంగారు నగలను చేయిస్తానని ప్రకటించారు. అంతే కాకుండా ఓదార్పులో బాగంగా హుస్సేన్ సాగర్ నిండా YS  విగ్రహాలను ప్రతిస్టించాడు. దాంతో సాగర్ లోని నీళ్లన్నీ బయటకు వచ్చేసి దోమల గూడ, లోవెర్ ట్యాంక్ బండ్ జలమయమయ్యాయి. ఇదంతా చూస్తూ బుద్దుడు కంగు తిన్నాడు. YS విగ్రహాల మద్య తన విగ్రహం చిన్నదైపోయింది.

  రాష్ట్రం లో మార్పులను గమనిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ జనం జగన్ కు దగ్గర అవుతున్నారని బావించి చనిపోయిన కుటుంబాలు అక్కడ లేనందున ఉన్న విగ్రహాలకు పరిహారంగా పది లక్షలు ప్రకటించింది. అంతకు ముందే అన్ని విగ్రహాలకు పరిహారం చెల్లించే రైట్ జగన్ తీసుకున్నాడు కాబట్టి బుద్ద విగ్రహానికి బంగారు పూత పూయించి పెద్ద కిరీటం పెట్టించింది. అన్ని విగ్రహాల మద్య ఇప్పుడు బుద్దుడు వెలిగి పోతున్నాడు, ట్యాంక్ బండ్ పైన మిగిలిన విగ్రహాలు కూడా ముందు కంటే అందంగా మెరిసిపోతున్నాయి. వినాయకుణ్ణి మాత్రం నాయకులే కాకుండా ప్రజలు కూడా మరిచిపోయారు.

Wednesday, June 2, 2010

వద్దుర నేస్తం హద్దుల ప్రణయం

వద్దని మనసు పొత్తులబతుకు
పద్దతులంటూ పాపపుపనులు
చిట్లిన వదనం అంతరమదనం
ఎప్పటికైనా తెగలని తగువు

వద్దుర నేస్తం హద్దుల ప్రణయం
వద్దకు చేరే అమృత ప్రళయం
ఎన్నటి మాటది స్వర్గపు ఊహ
నిన్నటి వేళకు సమాధి చేసి
రేపటి నరకపు ద్వారం తెరిచి
వెళ్తున్నావా? తెలిసీ, వలచి..


కన్నులు పొడిచే రాత్రులకంతా
బంటుగ నీవు బతకాలింక
చెంగున ఎగిరే దినాలనింకా
మత్తుగ తూగుతు గడపాలింక


ఎర్రటి కన్నుల జీరలు కరిగి
గుట్టల తూగే పొట్టలుపెరిగి
ఒట్టిన  తోలుతొ బట్ట తలలతో
మరో ప్రపంచపు దారిని తెరిచి
ప్రేగు బంధాన్ని కత్తితొ నరికి
ప్రేమ పుస్తకపు పదాన్ని నమిలి
తంత్రులు తెంచి వీణను విరిచి
కొత్త స్వరాలను సంధిస్తావా?


వెన్నెల రాత్రుల చల్లనిగాలికి
వెచ్చని స్వేదపు చుక్కలుపరిచి
ఇద్దరు నిండిన యుద్దభూమిలో  
మెత్తని శ్వాసల కత్తులు దూర్చి
ఆత్మల హోరులొ రాక్షసచోరులు
తిరిగే వేళను పొగరుతొ గెలిచి
మదపుటేనుగుల తేరులనెక్కి
కొత్త తరాలను సృష్టిస్తావా?

తీపిగుర్తులను చేదుగ మార్చి
ఎగిరేపక్షికి రెక్కలు ఒలిచి    
ఉరికేగుఱ్ఱపు కళ్ళెము పట్టి
ముందు కాళ్ళకు బంధము పెట్టి
కాదూ కూడదు వెళతానంటే  ..
ఎండమావులను తడతానంటే  ...



ఆవేశాల తలలను వంచి
ఆశయతీగల వేళ్ళను తుంచి
బ్రహ్మచర్యాన్ని బానిసచేసి
ప్రకృతి కళ్ళకు గంతలు కట్టి
నిజాలనంతా సమాధి చేసి, నీ
ప్రపంచానికిక పాతరవేసి
ఉక్కు కోటలను నిర్మించాలి
నిప్పు కణాలను చుంబించాలి
అమ్మే ఎరుగని అనుబందాలను
అరచేతిలొ నువ్ బంధించాలి


అంతేలే ఇది  నీలిరహస్యం
అంతే తేలని ఎడారిపయనం
సొంతం కానిది నిన్నటి భ్రమరం
నీదవుతుందొక  విలాస పుష్పం

అదిగో అదిగో అందని స్వర్గము
అంచున ఉందొక నీకై పాదము
అహాన్ని వదలి అణుకువ ఎరిగి
గతాన్ని విడిచి గృతాన్ని పోలి
హాయిగా ఎగిరే సత్తా ఉంటే ..
నీదే నీదే నీదే పోయిక
ఎవరికి అందని జీవిత శిఖరం.


 01 -06 -2010  

Wednesday, May 26, 2010

ఆరిన కవితాదీపం-ఆగని అమృతగానం

(వేటూరి సుందరరామమూర్తి, 29 January 1936 – 22 May 2010)


పాటలో తెలుగు పదాల కోసం వెతకవలసిన ఈ తరంలో ..
సాహిత్యపు పదభావాలను వెతుక్కునేలా చేసి
భావాన్వేషణలో మేము తలమునలకలయితే
ఇక ఈ లోకంతో పని లేదంటూ పరలోకానికి జారుకుంటావా?

' వేణువులా భువనానికి వచ్చావంటూ'
నవరంద్రాలతో జీవి భూమ్మీదికొచ్చాడని,
' గాలినై గగనానికి పోవడం' అంటే
కీర్తిని ప్రతి మనసులో 'గాలి శూన్యాన్ని ఆవహించినట్టు' నింపడమని
చెప్పడానికే నీవు తప్పుకొన్నావా?

ఆరగిపోయీ, మరచి పోయిన తెలుగు పదానికి
పచ్చని పల్లెలనూ, పదహారేళ్ళ పడచు అందాలనూ
గోదారి అలలనూ, అజంతా హొయలనూ అద్ది
నిద్రాణంలో ఉన్న భాషను బతికించడానికి తపించి, అలసి నిద్రపోయావా?

కాశ్మీరు అందాలూ, కలకత్తా కావ్యాలు, మీనాక్షి
మధురాలూ, యువరక్తపు భావాలూ,
నటరాజ నాట్యాలూ, నయనాల సొగసులూ
ఓహో.. ఎన్నని చెప్పగలం, ఏమని చెప్పగలం
ఆ కలం నుంచి జారిన తెలుగు సాహితీ ప్రవాహాలు

యవ్వనంలో వైరాగ్యం, వృద్దాప్యంలో జాణతనం
చీకటిలో దాగిన వెలుగునూ, వేడి నుంచి రాలే చలువను
ఎలా స్ప్రుశించావ్, నిన్ను ఎలా స్మరించమంటావ్?
ఎన్ని విరహహృదయాలను లాలించావో,
ఎన్ని మండు గుండెలను చల్లార్చావో?

నీవిక లేవని తెలిసిన మరుక్షణం, నీ ఉనికి కోసం
ఎన్ని గొంతులు 'గూగుల్' గుండెను ప్రశ్నించాయో?
అవి ఒక 'గూగోల్' అయినా ఆశ్చర్యం లేదేమో!

' రాజు జీవించు రాతి గోడలపైన
సుకవి జీవించు ప్రజల నాలుకలపైన '
ఎంత సత్యం, ఎంత నిత్యం
ఈ నాటికీ నీ రూపంలో !

పువ్వు రాలినా రాగమాగదు,
వాడిన పొద్దు వర్ణమూ మారదు
గుండెల్లో దాగిన నీ చాయగా..
గొంతుల్లో ధ్వనించే నీ గానంలా..



సశేషం...

Friday, March 26, 2010

నీ నవ్వూ .. నా నువ్వూ ..

ఈ వయసూ ..
     నీ సొగసూ ...
          నా మనసూ ....
          ఉప్పొంగుతూంది!
               నన్ను కదిలించడానికే కదూ?

ఈ పువ్వూ ..
    నీ నవ్వూ ...
         నా నువ్వూ ...
          పుట్టింది !
          నన్నేడిపించడానికే కదూ?

నా కలలూ ..
   ఆ అలలూ ..
     నీ హొయలూ...
     ఎగసిపడేది !
     నన్ను నిలువునా ముంచేయడానికే కదూ?

ఈ ఉదయం..
   నీ పరువం ..
      నా హృదయం...
      రగిలిపోతుంది !
      నన్ను దహించివేయడానికే కదూ ?

.... జె శాంత్ కుమార్
22/07/2009

Monday, March 1, 2010

ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!

 దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రంకోసం చేస్తున్న పోరుకు ఫలితం, కలలు సాకారమయ్యే రోజులివి. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ప్రజలంతా ఉద్యమంలోకి దూకుతున్నారు. నాయకులు, పెట్టుబడిదారులు, కుల, మత చాందసవాదులు ఏ స్వార్థంకోసం తపిస్తున్నారో తెలియదు గానీ, సామాన్య ప్రజానీకం, యువత మాత్రం ఉద్యమాన్ని భుజాలనెత్తుకొని, పోలీసు లాఠీలకు, అధికారుల బెదిరింపులకు, తెలంగాణవ్యతిరేకుల ధనాశకు తలొగ్గకుండా, ధైర్యంతో ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. ఏ పాపం ఎరుగని నిరుపేద యువతీ యువకులు కళ్ళముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్రం కొందరి అహంకార, అధికార, ధన బలం ముందు తలవంచుకు పోతుంటే, ఇక రాష్ట్రసాధన కలగానే మిగిలిపోతుందనే భయంతో, బాధతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ప్రకటన చేసిన తర్వాత, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వెనక దాగి ఉన్న కుట్ర గురించి, దానికి పాల్పడ్డ వాళ్ళకున్న బలం గురించి.
   తెలంగాణ వ్యతిరేక పెట్టుబడుదారులు , రాజకీయ నాయకులకు కేంద్రం తలొగ్గింది. వీరికి అంత బలం ఎవరిచ్చారు? అది ఇక్కడి ప్రజలే.. ఇది నిజం. ప్రస్తుత రాజకీయ ప్రభావాలను తట్టుకుని ప్రభుత్వాలు నిలవాలంటే ఆర్ధికంగా పార్టీలు బలంగా ఉండాలి. కారణం ఏదైనా మన రాష్ట్రంలో ఆర్ధికంగా బలంగా ఉన్నది సీమాంద్ర ప్రాంతానికి చెందినవారే. కాని వారి వ్యాపార వృద్ధికి తోడ్పడ్తుంది మాత్రం తెలంగాణ ప్రజలే. ఆంద్ర, రాయలసీమలు రెండూ పెట్టుబడులలో ఒకదానితో ఒకటి  పోటీపడుతున్నై. వారికున్న ప్రాంతీయ అభిమానంతో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో గట్టిపోటీ ఉంటుంది. అందుకే వారి వ్యాపారాలు అక్కడ తొందరగా వృద్ధిచెందవు. తెలంగాణ ప్రాంతం మాత్రం వీరి ఉత్పత్తులను ప్రాంతాలకతీతంగా వినియోగిస్తారు. ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యాపారాల్లో పోషించే పాత్ర తక్కువ కావడంవల్ల అధిక లాభాలనార్జించే అన్ని రంగాల్లో సీమాంద్ర పెట్టుబడిదారులే కనిపిస్తారు.
  అంటే ఒకవైపు తెలంగాణా ప్రజల సంపదతో వ్యాపారం చేస్తూ, అదే సంపదతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలే తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్లు. అలాంటప్పుడు ఎన్ని ఉద్యమాలు వచ్చినా పెద్దప్రయోజనం ఏమీ ఉండదు. ఏ ఉద్యమమయినా  ఫలితాలను పొందాలంటే, ఉద్యమం ఎక్కువకాలం నిలబడాలి. ఉద్యమ విధి విధానాలు, ఆశయాలూ, లక్షాలూ సామాన్యుడిని చేరాలి. నేటి పరిస్తితుల్లో ఎలాంటి విషయమైన చిటికెలో ప్రపంచమంతా వ్యాప్తి  చెందించే మాద్యమం TV చానల్స్ మాత్రమే. మరి తెలంగాణ ఉద్యమాన్ని సద్భావంతో, సదుద్దేశ్యంతో సూటిగా లక్ష్యం వైపు గురిపెట్టగలిగే రీతిలో చూపించే ఏ ఒక్క ఛానల్ అయినా ఉందా అంటే అది అంతుదొరకని ప్రశ్నే. ఒకవేల ఉన్నా వాటికున్న ఆదరణ అంతంతమాత్రమే. ఒక విషయం మంచిదా, చెడ్డదా అని నిర్ణయించేది, పదిమందీ దాని గురించి ప్రస్తావించడం వల్లే. ఈ నగర జీవితంలో ఆ పదిమందీ తనే అయి పోషిస్తున్నాయి T V చానల్స్. అందుకే ఒక్క రోజులో తివారి విటుడయ్యాడు, రాజశేఖర్ రెడ్డి దేవుడయ్యాడు. ఇదంతా మీడియా సృష్టి కాదా?
 తెలంగాణాలోని ప్రతి పల్లె అగ్నిగుండంలా ఉంది. రేపటి తరానికి దిశా నిర్దేశాలు సూచించే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు మానవత్వం మరిచి యువతీ యువకులను దారుణంగా హింసిస్తున్నారు. ఇన్ని జరిగినా ఏ టి.వి ఛానల్లో కూడా వీటికి సరైనస్తానం  దొరకకపోవడం బాదాకరం. చాలా సందర్బాలలో తెలంగాణ ప్రజల మద్య విబేదాలు పెంచే రకంగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్ తప్ప ఇది న్యాయమైన పోరాటం అని చెప్పే టి.వి చానల్స్ కరువయ్యాయ్. ఉద్యమం నిలబడాలంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని గాయాలపాలవడం, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ ఉద్యమం ఓ పోరు. ఈ పోరులో నెగ్గాలంటే వ్యతిరేక శక్తులను బలహీన పరచాలి. ఇక్కడ వ్యతిరేకతకు ఉన్న బలం డబ్బు, అధికారం. ఆర్తికంగా బలహీనమైతే రాజకీయంగా ఎదగడం కష్టం. అందుకే సీమాంద్ర వస్తు, వ్యాపార, సేవలను బహిష్కరించాలి. అందులో బాగంగా అన్నిటికంటే ముందుగా చేయాల్సింది ఉద్యమాన్ని వక్రీకరించి, నీరుగార్చే టి.వి చానల్స్ ని ఆదరించక పోవడం లేదా వాటిని పూర్తిగా తొలగించడం. దీంతో ముందుగా యువత బలిదానాలు ఆగిపోతాయి. ప్రజలకు నిజాలు తెలవకపోయినా అబద్ధాలకు, అభూతాలకు తావుండదు. ఎప్పుడూ ఎదుటివాడిని వేలెత్తి చూపే చానల్స్ T.R.P(Target Rating Point)  లు పడిపోయి ఇక ముందైనా నిజాలను చూపించే ప్రయత్నాలు చేస్తాయి. ఆకలి కేకలకూ, కన్నీటి వ్యధలకూ గుర్తింపు దక్కుతుంది. ఉద్యమాలు వర్ధిల్లుతాయి. 


ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!
....
జెశాంత్ 

Tuesday, February 23, 2010

నిజం ఉద్యమం! నివురు జర్నలిజం!!

 ఉస్మానియా విద్యార్థులు - అందులో మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం అండతో పోలీసులు లాఠీచార్జ్ చేసి దారుణంగా హింసించారు. దీని వెనుక విద్యార్థుల తప్పులేదని ఇదంతా తెలంగానేతరుల కుట్రని తెలిసినా మీడియామాత్రం అంతగా స్పందించలేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వం, పోలీసులు, మీడియా కలిసి పన్నిన కుట్ర. దీన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది  ..........



విశాల నిశీధి విలయతాండవం
వికార మానవ దురహంకారం
అనాది భారత యుగాల మడుగున
ఆరాధనతో ఆదిగకొలిచిన
మాతా, సోదరీ, యువతీ, దేవతా ..
నవీన భారత పునీత వనితా !


హక్కులకోసం పాకులాడితే ..
ఎదరొమ్ములపై పోలీసు బూటూ
పొత్తికడుపులో తుపాకిపోటు,
చెదిరిన జుట్టొక గుర్రపుకల్లెము
విద్యాలయమే నిలువెత్తు సాక్షము
నీ దేహమే తారురోడ్డుకు నేస్తము ..


చిమ్మ చీకట్లు సూర్యున్ని మింగేసినయ్ ..
నల్ల మబ్బులు చంద్రున్ని కమ్మేసినయ్ ..
వీదిదీపాలను డబ్బు చేతులు కప్పేసినయ్ ..
'ఆడ' పదాన్ని మహిళా సంఘాలు అమ్మేసినయ్ ..
మానవత్వాన్ని ప్రాంతీయతత్త్వం కొనేసింది !


లాఠీలు బాధ తాళలేక
                    ముక్కలుగా విరిగిపోయినయ్ !
రబ్బరు బుల్లెట్లు దారుణాన్ని చూడలేక సిగ్గుతో
                     యువత గుండెల్లో తల దాచుకున్నయ్ !!
అరుపులూ, కేకలూ, ఆక్రోశాలూ, ఆక్రందనలూ ..
రక్తాలూ, గాయాలూ, బాధలూ, వ్యధలూ ..
చిత్తు కాగితాలపై పిచ్చి భావాలయినయ్ !

హాస్టలురూము ఫ్యానూ, సెల్టవర్ అంచూ..
ఆడిటోరియం రూఫూ, బలిదానాలకు వేదికలయినయ్ !!

ద్రౌపది వ్యధనా? కీచక వధనా??
అంతులేని ప్రశ్నలరాత్రిని ' రోషం(?)' కమ్మేసింది
నిజం ఉద్యమం, నివురు జర్నలిజం..
నేనింకా బతికే ఉన్నానంటూ ..
                         తెల్లవారగానే..ఉన్నత న్యాయస్థానం??

Thursday, January 21, 2010

శవాలపై లేస్తున్న జెండాలు !!!



కాలుతున్న శవాలు, నేల
రాలుతున్న పరిమళాలు
పచ్చి మాంసపు వాసనలపై
ఎగురుతున్నాయ్ చూడు
సమైక్యాంద్ర జెండాలు !!

యువత ఆత్మహత్యలు, కాదు ఇవి
బడుగు జీవుల హత్యలు
ప్రత్యేక పోరు వెనుక
సాగుతున్నాయ్ చూడు
శవపు రాజకీయాలు !!

అభివృద్ధి మంత్రాలూ
అతికొద్ది పంపకాలు
అణగారిన జనాలపై
లేస్తున్నాయ్ చూడు
పెత్తందారి కోటలు !!

ఇలాత్కయలమ్మే ఇస్మయిలూ, మోర్లూడ్చే మల్లిగాడు
వీళ్ళ కోసమేనట నేటి ఈ సిత్రాలు
పేదరికం ముసుగు వెనక
చిందులేస్తున్నాయ్ చూడు
కోట్లకు పడగలెత్తిన తారలు !!

కలిసుంటే స్వర్ణయుగం, విడిపోదామంటే

మారుతుంది వర్ణం
వెర్రివాదనొకటి పైకిలేచి
బ్రమపెడుతోంది చూడు
నక్స లైటు భూతం !!

ఒక్కటవుతున్నాయి జిత్తుల నక్కలు
ఖాళీ అవుతున్నాయి ధనం మూటలు
ఇపుడు చచ్చిన శవాల పై సైతం
విరుగున్నాయ్ చూడు
ఖాకీల చేతిలో లాఠీలు !!!

Monday, January 4, 2010

విద్యార్థి గర్జన

ఓ .యు. విద్యార్థి గర్జన
ఓ యువరక్తపు ఘోషణ
రాజధాని నడిబొడ్డున
రగిలిన సంఘర్షణ

శతాబ్దాల గతమంతా
తిరగబడ్డ సోదరా ..
దశాబ్దాల కాలమంత
ధగాపడ్డ తమ్ముడా ..
వృధా కాదు నీ స్వేదం
యదార్థాల సాక్షిగా
యావత్ తెలంగాణా ఉంది
సదా నీకు తోడుగా ..

వాటాలు ఒకరికి
తూటాలు ఒకరికా?
మాటల్లో కోటలూ
చేతల్లో గోతులా ?
ఇక చాలు ఇక చాలు
బానిసపు బతుకులు
ఇకనైనా పీల్చనీయ్
స్వేచ్చా వాయువులు

కలిసొస్తే స్వాగతం
మా మనసులు సముద్రం
ఎదురొస్తే స్వేచ్చకు
విప్లవాల వీరులం

శ్రమ జీవులు, శ్రామికులూ
కర్షకులు కార్మికులూ
బడి పిల్లలు, మేధావులు
విడిపోతాం ఇకనైనా
సెలవంటూ చెపుతూంటే
వృద్ది అంటావ్, సమిష్టి అంటావ్
కలిసుండాలని శాసనం చేస్తావ్
ప్రజలంతా ఒకే మాటపై
నిలబడ్డారు అంటావేం
ప్రజలనే జాబితాలో
తెలంగాణ బిడ్డలను
ఇక నైనా చేర్చలేని
మాటలోని ఆ సత్యం
నీ చేతలోని ఔదార్యం
చూసి నిట్టూర్చే గదా
ఈ లోకం, నా ప్రాంతం
సమైక్యాంద్ర పదంలోనే
మతలబెందో అర్ధమాయే
తెలంగాణ కేక్కడిదిక నీ
నిఘంటువులో ఓ స్థానం

విడిపోయే వాన్నిగదా
ఓదార్చే అవసరం మరి
కలిసుండే వాని వెనుక
పడతారేం విడ్డూరం

నీది కాని గోచిపైన
ఎందుకింత కలకలం
పరాయి గడ్డమీద
ఏమిటింత పెత్తనం

ముళ్ళ మధ్య విరిసింది
అందమైన తామరం
తెలంగాణ గుండె రా
అది భాగ్యమైన నగరం

పువ్వు దోయ చూశావో
ఒళ్ళు గుల్ల తెలుసుకో మా
నవ్వు దోయ చూశావో
రేపు నీకు లేదుపో ....

Monday, December 21, 2009

చరిత్ర నీడలో కలకత్తా !


గతుకుల దారుల ...
చితికినబతుకుల ...
ఉరుకుల పరుగుల దీ ..
                      నగరం


దోపిడి రాజ్యం
దొంగల బోజ్యం
కమ్మునిజం ..
            చూస్తారిక్కడ ఈ చోద్యం


నీ గతమేమో బానిస తత్త్వం
చేస్తావిప్పుడు పని దొంగతనం
రేపటి సూర్యుని చూడక పోతే ..
మార్పును ఆహ్వానించక పోతే ..
బతికేదేలాగ భావితరం ?


పేరుకైతే ఇది మహానగరం
చరిత్రకేమో మహాసముద్రం
బీటలు వారెను వర్ధమానం
చీకటి వీధులతో .. కూలిన గోడలతో ..


పేదా .. గొప్పా .. సమానమంటావ్ !
మన పాలననే సముచితమంటావ్ !
మన ఇద్దరి పయనం ఒకే దారిపై
నీవా మెరిసే కారులో ...
నేనీ తోపుడు బండీతో


మన పనులూ, పరువూ ఒకటేనోయ్
మన బాటా, మాటా ఒకటేనోయ్
మనమిద్దరం కష్టపడుతున్నాం
ఒకరి కోసం ఒకరం ..
నీ బూటుకు వన్నెతెస్తూ నేను ..
ఆ వన్నెలో నా ముఖం వెలిగిస్తూ నీవు ..


మన ఇద్దరి జీవితమొకటేలే
మన ఇద్దరి వీధీ ఒకటేలే
సహజీవనమే చేస్తున్నాం
నీవా మెరిసే కోటలో ....
నేనీ మురుగు నీటిలో !!

యువకులదంతా జులాయితనం
యువతులదంతా ప్రేమాయణం
ఏంచేస్తారులే వాళ్ళైన పాపం ..
చేయడానికి వారికి పనిలేదు
చూపడానికి నీ సిద్ధాంతం ఒప్పుకోదు !!