29.11.2010: సోమవారం కడప MP Y.S జగన్ తన MP పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి YSR సతీమణి Y.S విజయలక్ష్మి కూడా తన పదవికి రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామాకు వివరణ ఇస్తూ ఐదు పేజీల బహిరంగ లేఖను రాశారు. అందులో గత 14 నెలలుగా పార్టీ తనను ఒంటరిని చేస్తూ వచ్చిందని, తన తండ్రి మరణానికి కారణాల కోసం తూ తూ మంత్రంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు.
Monday, November 29, 2010
Thursday, November 25, 2010
ముఖ్యమంత్రి మార్పు సమంజసమేనా?
రాష్ట్రంలో నెలకొన్నఅనిశ్చితి రోజురోజుకు పెరిగిపోయింది. రోశయ్య ముఖ్యమంత్రి బాద్యతలు తీసుకున్న రోజునుంచి రాష్ట్రం అతలాకుతలమయ్యింది . సామాన్యంగా ఇలాంటి పరిస్తితులను ప్రతిపక్షాలు ఒక అవకాశంగా తీసుకుంటాయి. అవకాశం దొరికిన ప్రతిసారి మీడియా ముందు విమర్శలు కురిపిస్తాయి .ఈ పరిస్తితుల్లో ఎవరికైనా సొంతపార్టీ నుంచి బలమైన సపోర్ట్ అవసరం. కానీ గత 14 నెలలూ రోశయ్యకు ప్రతిపక్షం కన్నా సొంత పార్టీ నుంచే ఎక్కువ ఇబ్బందులెదురయ్యాయన్నది వాస్తవం. సహజంగా మెతక స్వభావంగల రోశయ్య వీటిని ఎదిరించే సాహసం చేయలేదు . సమస్యలను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి మార్పు అవసరమే అన్నది విశ్లేషకుల అబిప్రాయం .
ఉత్కంటలో రాష్ట్రరాజకీయాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని రాజకీయాలు వేగంగా మారిపోయాయి. మంగళవారం (23.11.2010) మాజీ ముఖ్యమంత్రి రోశయ్య డిల్లీకి వెళ్ళడం, బుదవారం మద్యాహ్నం -24.11.2010 రాజీనామా సమర్పించడం , అదే రోజు సాయంత్రం 7గంటలకు అసెంబ్లీలో CLP సమావేశం, డిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ప్రణబ్ ముఖర్జీ , గులంనబి ఆజాద్, A.K అంటోనీ తదితరులు రోశయ్యకి కృతఙ్ఞతలు, కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం సోనియాకె ఇస్తున్నట్లు రెండు ఏక వాక్య తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదింపచేయడం, మూడు గంటలు గడవక ముందే అంటే సుమారు రాత్రి 10 గంటలకే ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆమోదించడం చకచకా జరిగి పోయాయి.
Monday, November 22, 2010
పాప లేదని తెలిసి..నేస్తం కన్ను చెదిరి..
నవ మాసాలూ మీ అమ్మే మోసిందనుకున్నావు కదూ?
మీ అమ్మ నిన్ను మాత్రమే మోసింది తన గర్భంలో
కాని, నేను మిమ్మల్నిద్దర్నీ మోశాను తల్లీ నా గుండెలో
చిట్టి తల్లీ నీకు తెలుసా?
దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని చిలికితే
అమృతం పుట్టిందట
నేను మీ అమ్మ ఎన్నో రాత్రులను మదిస్తే
నువ్వు పుట్టావురా..
మేధావులు వున్న వాటిని కనుక్కుంటారు
'జీవం' లేని వాటిని శ్రుస్టిస్తారు
నేను మేధావిని కాదురా.. కానీ
పాతికేళ్ళుగా సాగించిన ప్రస్తానంలో
నేను కొత్తగా కనుగొన్నదీ, సృష్టించిందీ నిన్నే..
నీ ఆరోగ్యం కోసం నేనో డాక్టర్నైనా
నీ ఆటకోసం నేనొక బొమ్మనైన
నీ పాలనలో నేనో సేవకున్నైన
మీ అమ్మ మనసులో నేనొక శిలనైన
నీ కోసం తిప్పిన పుస్తకాలూ
వెతికిన బ్లాగులూ, చూసిన సైట్లూ
వేసిన ప్రశ్నలూ, తెలుసుకున్న విషయాలూ
నా కోసం చదివితే నేనో మేధావినయ్యేవాణ్ని
వేయి లైన్ల కోడ్ లో దాగిన తప్పును
క్షణంలోనే పట్టగలిగిన
నేల రాలిన తారలో నశించిన శక్తిని
గాలిలోనే లెక్కగట్టిన
నీ కంటిలోని నీటినీ.. నీ ఒంటి లోని వేడినీ..
నీ కడుపులోని భాదనూ, నీ జీవితపు ఆయువునూ
పసిగట్టలేక పోయిన.
నా చదువూ, నా తెలివీ
నా జీతాన్ని నిలబెట్ట గలిగినయ్ కానీ నీ జీవితాన్ని కాదు..
తలుకుమన్నసిడిలో, టివి పైన ఫోటో ఫ్రేములో ..
గోడకేసిన ఊయలలో, గోడు బోయిన గుండెలో..
మోడు వారిన బతుకులో, ఆ అనంత ఆకాశంలో
మాకు పాఠాలు నేర్పి, గుణపాఠంగా
ముసిముసిగా నవ్వుతూ... మా పాప!!
( నేస్తం కన్ను చెదిరినపుడు.. పాప లేదని తెలిసినపుడు )
మీ అమ్మ నిన్ను మాత్రమే మోసింది తన గర్భంలో
కాని, నేను మిమ్మల్నిద్దర్నీ మోశాను తల్లీ నా గుండెలో
చిట్టి తల్లీ నీకు తెలుసా?
దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని చిలికితే
అమృతం పుట్టిందట
నేను మీ అమ్మ ఎన్నో రాత్రులను మదిస్తే
నువ్వు పుట్టావురా..
మేధావులు వున్న వాటిని కనుక్కుంటారు
'జీవం' లేని వాటిని శ్రుస్టిస్తారు
నేను మేధావిని కాదురా.. కానీ
పాతికేళ్ళుగా సాగించిన ప్రస్తానంలో
నేను కొత్తగా కనుగొన్నదీ, సృష్టించిందీ నిన్నే..
నీ ఆరోగ్యం కోసం నేనో డాక్టర్నైనా
నీ ఆటకోసం నేనొక బొమ్మనైన
నీ పాలనలో నేనో సేవకున్నైన
మీ అమ్మ మనసులో నేనొక శిలనైన
నీ కోసం తిప్పిన పుస్తకాలూ
వెతికిన బ్లాగులూ, చూసిన సైట్లూ
వేసిన ప్రశ్నలూ, తెలుసుకున్న విషయాలూ
నా కోసం చదివితే నేనో మేధావినయ్యేవాణ్ని
వేయి లైన్ల కోడ్ లో దాగిన తప్పును
క్షణంలోనే పట్టగలిగిన
నేల రాలిన తారలో నశించిన శక్తిని
గాలిలోనే లెక్కగట్టిన
నీ కంటిలోని నీటినీ.. నీ ఒంటి లోని వేడినీ..
నీ కడుపులోని భాదనూ, నీ జీవితపు ఆయువునూ
పసిగట్టలేక పోయిన.
నా చదువూ, నా తెలివీ
నా జీతాన్ని నిలబెట్ట గలిగినయ్ కానీ నీ జీవితాన్ని కాదు..
తలుకుమన్నసిడిలో, టివి పైన ఫోటో ఫ్రేములో ..
గోడకేసిన ఊయలలో, గోడు బోయిన గుండెలో..
మోడు వారిన బతుకులో, ఆ అనంత ఆకాశంలో
మాకు పాఠాలు నేర్పి, గుణపాఠంగా
ముసిముసిగా నవ్వుతూ... మా పాప!!
( నేస్తం కన్ను చెదిరినపుడు.. పాప లేదని తెలిసినపుడు )
సంధి కావ్యం
విరహాన్ని మెత్తగా
కోపాన్ని మత్తుగా
ప్రేమని ఘాటుగా
మనసును వేడిగా
మాటను వాడిగా
నీతిని తెలివిగా
బాధను హాయిగా
అనుభవించవోయ్ తలకిందులుగా
ఇక చొప్పుకోవోయ్ కొత్త కవితలా..
కోపాన్ని మత్తుగా
ప్రేమని ఘాటుగా
మనసును వేడిగా
మాటను వాడిగా
నీతిని తెలివిగా
బాధను హాయిగా
అనుభవించవోయ్ తలకిందులుగా
ఇక చొప్పుకోవోయ్ కొత్త కవితలా..
Sunday, November 21, 2010
మనుషుల గురించి!!
ఆలోచన రెండు రకాలు
ఒకటి ఇతరుల మేలు కోరేది
మరొకటి నిన్ను నీవు దహించేది
మిగితావంటావా ?
నేను మాట్లాడేది ఆలోచన గురించి !
వేగం రెండు రకాలు
ఒకటి మరణం వైపు నెట్టేది
మరొకటి విజయాన్ని తట్టేది
మిగితా వంటావా?
నేను మాట్లాడేది వేగం గురించి!
ప్రేమ రెండు రకాలు
ఒకటి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించేది
మరొకటి నిన్ను ద్వేషించే వారినీ ప్రేమించేది
మిగిలిన వంటావా?
నేను మాట్లాడేది ప్రేమ గురించి!
మనుషులు రెండు రకాలు
ఒకరు జీవితంకోసం పోరాడేవారు
మరొకరు పోరాటంకోసం జీవించేవారు
మిగితావాళ్ళంటావా ?
నేను మాట్లాడుతుంది మనుషుల గురించి!!
ఒకటి ఇతరుల మేలు కోరేది
మరొకటి నిన్ను నీవు దహించేది
మిగితావంటావా ?
నేను మాట్లాడేది ఆలోచన గురించి !
వేగం రెండు రకాలు
ఒకటి మరణం వైపు నెట్టేది
మరొకటి విజయాన్ని తట్టేది
మిగితా వంటావా?
నేను మాట్లాడేది వేగం గురించి!
ప్రేమ రెండు రకాలు
ఒకటి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించేది
మరొకటి నిన్ను ద్వేషించే వారినీ ప్రేమించేది
మిగిలిన వంటావా?
నేను మాట్లాడేది ప్రేమ గురించి!
మనుషులు రెండు రకాలు
ఒకరు జీవితంకోసం పోరాడేవారు
మరొకరు పోరాటంకోసం జీవించేవారు
మిగితావాళ్ళంటావా ?
నేను మాట్లాడుతుంది మనుషుల గురించి!!
Subscribe to:
Comments (Atom)