Monday, September 20, 2010
కలకత్తా మెట్రో
(Culacutta metro since 24' October, 1984, - on the occassion of Hindi divas on 14092010 )
కాలంతో నా పోరాటం
గమ్యం చేర్చే ఆరాటం
నేటి తరానికి నా వేగం
ఎప్పటికైనా ఆదర్శం
కవి నజ్రూల్ ధంధం నడుమన
దరి చేర్చే బాటసారిని
కలకత్తా మెట్రోన్నేను
కష్టాల కడలిని కాను
భూమిని సైతం చీల్చగలను
ఆకాశపు నిచ్చెనలెక్కగలను
ఎంతెదిగినా ఒదగగలను
తరాలనింకా మోయగలను
ఆవేశమన్నది నా నైజం
ఆలోచన కున్నది లే స్థానం
ఆగుతు సాగుతు పయనిస్తూ
ఆత్మ విమర్శన చేయగలన్
ఉరుకుల పరుగుల వేగంతో
నువ్ నా ఒడిని చేరినపుడు
ఉక్కిరి బిక్కిరి సమయంలో
నీకు ఊపిరి ఆడనపుడు
ప్రతి మజిలిలో నీ కోసం
చల్లని గాలిని గుండెన నింపి
నీ ఒడికి మెల్లగా చేరుస్తా
ఆదివారపు సెలవులలో
హర్తాల్ బంద్ల గొడవలలో
మీరురాని సమయానికి
మీరులేని ఒంటరితనం
కడలి వదిలిన తీరం నేను
ప్రాణం వదిలిన నిర్జీవం నాది
వృద్డులనైతే ఆదరిస్తా
మగువలనైతే ఆరదిస్తా
బారమెంతైన భరించగలుగుతా
కాని, నా కింద పది నలగొద్దు దేహం
నీ జీవితాన్ని నాకు బలి చేయకు నేస్తం
నేటి తరానికి నా గమనం
కావాలింకా ఆదర్శం
కలకత్తా మెట్రోన్నేను
కష్టాల కడలిని కాను.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment