Tuesday, September 14, 2010

మరో గోతిని పూడ్వడానికని!!

తన కొమ్మని తనే నరుకుతున్నాడో
                               తుంటరి ..
దారిన పోయే దానయ్యకు  జోస్యం చెప్పుకుంటూ...

గోతిని తొవ్వుతున్నాడు చూడు
                          గోచి ఎగబాకి  ..
ఎందుకంటే, అంటాడు మరో గోతిని
                           పూడ్వడానికని...

సముద్రంలో నీళ్ళు తోడుతున్నాడు
                               సన్నాసి ..
వాని ఊరి ఏటిని నింపడానికి ..

ఎండలో మంటకు గొడుగు పడుతున్నాడు
                                 మాడిపోతూ...
ఆ వేడి, సూర్యున్ని తాకకుండా ఉండడానికి ..

కొండను తొవ్వమందొకత్తె కోటగోడ నెక్కి ,
    పుట్ట లోని పాములను శాసిస్తూ ..
ఎదురు తిరిగిన ఎలుకను పట్టడానికి ..

కాసులు జల్లుతున్నారు గుంపు మీద
                           ఇసుక గంపతో ..
ఇసుక పోసినా రాలని జనం వచ్చినారని
                          తెలుసుకోడానికి..

పుణ్య పురుషుడని బయలుదేరినాడొక
                          వెర్రివాడు ..
అహంకారపు గునపం చేతబట్టి ఆవేశంతో...
తండ్రి పాపాలని  తెలవక తోడుకుంటూ..

1 comment: