ఈ వయసూ ..
నీ సొగసూ ...
నా మనసూ ....
ఉప్పొంగుతూంది!
నన్ను కదిలించడానికే కదూ?
ఈ పువ్వూ ..
నీ నవ్వూ ...
నా నువ్వూ ...
పుట్టింది !
నన్నేడిపించడానికే కదూ?
నా కలలూ ..
ఆ అలలూ ..
నీ హొయలూ...
ఎగసిపడేది !
నన్ను నిలువునా ముంచేయడానికే కదూ?
ఈ ఉదయం..
నీ పరువం ..
నా హృదయం...
రగిలిపోతుంది !
నన్ను దహించివేయడానికే కదూ ?
.... జె శాంత్ కుమార్
22/07/2009
Friday, March 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment